పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ఎంపీల నిరసన.. వీడియో ఇదిగో
- అదానీ స్కామ్ పై జేపీసీ వేయాలంటూ నిరసన కార్యక్రమం
- నిరసనల్లో పాల్గొన్న సోనియా, రాహుల్, ఖర్గే
- డప్పు వాయించిన సంతోష్ కుమార్
ఇక సంతోష్ కుమార్ డప్పు వాయించగా... ఇతర ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిరసనల్లో పాల్గొంది. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. పార్లమెంటు ఐదో విడత సమావేశాలు గత ఐదు రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ... అదానీ అంశం వల్ల ఒక్క రోజు కూడా సభాకార్యక్రమాలు సజావుగా జరగలేదు.