buggana: మహిళా సాధికారతపై కవిత చదివిన మంత్రి బుగ్గన

ap minister budget speech in assembly
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం పాటుపడుతోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి మాట్లాడుతూ.. మహిళల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకోసం బడ్జెట్ లో కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళల గురించి రాసిన ఓ కవితను ప్రస్తావించారు.

‘మహిళలు స్ఫూర్తిప్రదాతలు.. తమ అనుభవాలను జీవితపాఠాలుగా మలిచే మణిపూసలు.. మహిళలు ప్రకృతికి మరో రూపాలు.. మహిళలు మహిలో నడయాడే ఆదిపరాశక్తులు’ అంటూ మంత్రి చదివి వినిపించారు.

దీనిపై సభలో ఉన్న మహిళల నుంచి స్పందన రాకపోవడంతో మంత్రి వారివేపు చూస్తూ ‘ఏమ్మా మరోసారి వినిపించనా?’ అని అడిగారు. దీంతో స్పందించిన మహిళా ఎమ్మెల్యేలు చప్పట్లు చరుస్తుండగా మంత్రి మరోమారు కవితను చదివారు. ఈసారి ఎమ్మెల్యేలంతా బల్లలు చరుస్తూ మంత్రి బుగ్గనను అభినందించారు. ఈ క్రమంలో మహిళల కోసం బడ్జెట్ లో జరిపిన కేటాయింపులు కొన్నింటిని మంత్రి చదివి వినిపించారు.

డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించామని బుగ్గన తెలిపారు. వైఎస్సార్ కల్యాణమస్తు పథకానికి రూ.200 కోట్లు, అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్లు కేటాయింపులు జరిపినట్లు మంత్రి బుగ్గన తెలిపారు.
Go Back to Shorts
buggana
Andhra Pradesh
budget speech
women empowerment

More Telugu News