Nandamuri Suhasini: నందమూరి సుహాసిని ఇంట్లో పెళ్లిసందడి

  • సుహాసిని కుమారుడు శ్రీహర్ష ఎంగేజ్ మెంట్
  • వేడుకకు హాజరైన కల్యాణ్ రామ్
  • వైరల్ అవుతున్న ఫొటో
Nandamuri Suhasinis son Sriharsha gets engaged

నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇంట పెళ్లి సందడి నెలకొంది. సుహాసిని కుమారుడు వెంకట శ్రీహర్ష ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ వేడుకకు ఆమె సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్, మరో సోదరుడు, దివంగత జానకిరామ్ భార్య, కుమారుడు, ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. హైదరాబాద్ లో ఈ కార్యక్రమం జరిగింది. బిజీ షెడ్యూల్ కారణంగా మరో సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. మరోవైపు వేడుకకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News