ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టొద్దు.. మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు ఆదేశం
- జూబ్లీహిల్స్ సొసైటీ నుంచి 595 చదరపు గజాల భూమిని కొనుగోలు చేసిన చిరంజీవి
- ఆ భూమి ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించినదంటూ కొందరు కోర్టుకు
- కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని జీహెచ్ఎంసీ, హౌసింగ్ సొసైటీకి కోర్టు ఆదేశం
ఈ భూమిపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి నియంత్రణ లేకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించి సొసైటీ దానిని చిరంజీవికి విక్రయించిందని పిటిషనర్లు ఆరోపించారు. కొనుగోలు చేసిన భూమిలో చిరంజీవి నిర్మాణాలు కూడా చేప్టటారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని జీహెచ్ఎంసీ, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.