ఎయిర్ ఇండియా విమానంలో మరో షాకింగ్ ఘటన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిర్ ఇండియా విమానంలో మరో షాకింగ్ ఘటన

US citizen caught smoking in Air India London Mumbai flight trying to open door
  • లండన్ నుంచి ముంబై వస్తున్న విమానంలో కలకలం
  • బాత్రూమ్‌లో పొగతాగిన ప్రయాణికుడు
  • ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకూ యత్నం
ఎయిర్ ఇండియా విమానాంలో ఓ ప్రయాణికుడు కట్టుతప్పి ప్రవర్తించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. మార్చి 11న లండన్ నుంచి ముంబై వస్తున్న విమానంలో భారత సంతతికి చెందిన రమాకాంత్ బాత్రూమ్‌లో పొగతాగుతూ సిబ్బందికి చిక్కాడు. తన తోటి ప్రయాణికులతో అతడు అనుచితంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా.. అతడు విమానం ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించినట్టు విమాన సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో రమాకాంత్‌పై సహార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రమాకాంత్ మద్యం మత్తులో ఉన్నాడా? లేదా? అనేది తేల్చేందుకు బ్లడ్ శాంపిల్ సేకరించి, పరీక్షలకు పంపించారు. 

కాగా, మార్చి 4న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు ఇలాగే రచ్చ రచ్చ చేశాడు. కోల్‌కతా నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో అతడు బాత్రూమ్‌లో పొగతాగాడు. ఈ క్రమంలో వెలువడ్డ పొగ కారణంగా అలారం మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది గ్రౌండ్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. విమానం లాండైన అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అనీల్ మీరాగా గుర్తించారు.
Advertisement
Air India

More Telugu News