ప్రియాంక చోప్రా ఇచ్చిన పార్టీలో ఎన్టీఆర్ తో ప్రీతి జింతా సెల్ఫీ వైరల్
- దక్షిణాసియా నుంచి ఆస్కార్ నామినీలకు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చిన ప్రియాంక చోప్రా
- హాజరైన ఎన్టీఆర్ తో సెల్ఫీలకు క్యూ కట్టిన ఇతర నటీనటులు
- ఈ నెల 12న లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ ప్రదానోత్సవం
ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పలువురు ప్రముఖులు పోటీ పడ్డారు. బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతి జింతా ఎన్టీఆర్ తో సెల్ఫీ తీసుకున్నారు. దాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది. ‘నిన్న రాత్రి నేను కలిసిన ఆస్కార్ నామినీలందరికీ అభినందనలు. మీ అందరికి అవార్డులు రావాలని కోరుకుంటున్నా. దక్షిణాసియాలోని కళాకారులను ఒక్కచోటుకి తెచ్చినందుకు, ఒకరి విజయాలను మరొకరు జరుపుకున్నందుకు ప్రియాంక చోప్రాకు ధన్యవాదాలు’ అని ప్రీతి జింతా తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు.