ముంబయి బౌలర్ల వికెట్ల వేట... 105 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals bundled out fir 105 runs
  • డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబయి ఇండియన్స్ ఢీ
  • రాణించిన ముంబయి బౌలర్లు
  • తలో 3 వికెట్లు తీసిన సాలికా, వాంగ్, హేలీ
డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ చేసిన ముంబయి ఇండియన్స్... ఢిల్లీ క్యాపిటల్స్ ను 105 పరుగులకే కుప్పకూల్చింది. 

సాలికా ఇషాక్, ఇస్సీ వాంగ్, హేలీ మాథ్యూస్ తలో 3 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ పనిబట్టారు. ముంబయి బౌలింగ్ ధాటికి ఢిల్లీ జట్టు మరో రెండు ఓవర్లు మిగిలుండగానే 18 ఓవర్లకే ఆలౌట్ అయింది.

ఢిల్లీ జట్టులో కెప్టెన్ మెగ్ లానింగ్ 43 పరుగులు చేయగా, మిడిలార్డర్ లో జెమీమా రోడ్రిగ్స్ 25 పరుగులు చేసింది. రాధా యాదవ్ 10 పరుగులు చేయగా, మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబయి ఇండియన్స్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది.
Go Back to Shorts
Mumbai Indians
Delhi Capitals
WOL

More Telugu News