Nani: జానపద బాణీతో .. మాస్ స్టెప్పులతో మనసులు కొల్లగొడుతున్న 'దసరా' సాంగ్!

  • నాని హీరోగా రూపొందిన 'దసరా'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణ్ 
  • కీలకమైన పాత్రను పోషించిన సముద్రఖని 
  • ఈ నెల 30వ తేదీన విడుదలవుతున్న సినిమా 
Dasara lyrical song released

నాని హీరోగా 'దసరా' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో నాని జోడీగా కీర్తి సురేశ్ అలరించనుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. తెలంగాణ .. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథ ఇది. పక్కా మాస్ లుక్ తో ఈ సినిమాలో నాని కనిపించనున్నాడు. 

శ్రీకంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి 'చెమ్కీలా అంగీలేసి' అనే ఫుల్ సాంగును రిలీజ్ చేశారు. సంతోష్ నారాయణ్ స్వరపరిచిన ఈ పాట జానపద బాణీలో నడుస్తుంది. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, ధీ - రామ్ మిర్యాల ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని అందించాడు.   

గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ కథను మాస్ ఆడియన్స్ కి దగ్గరగా మలిచారు. కీర్తి సురేశ్ లుక్ కూడా కొత్తగానే ఉండనుంది. సముద్రఖని .. దీక్షిత్ శెట్టి .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. వివిధ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News