Nani: చెమ్కీల అంగీలేసి .. 'దసరా' సాంగ్ ప్రోమో రిలీజ్!

  • నాని తాజా చిత్రంగా రూపొందిన 'దసరా'
  • ఆయనతో రెండోసారి జోడీకట్టిన కీర్తి సురేశ్ 
  • సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణ్ 
  • ఈ నెల 30వ తేదీన ఐదు భాషాల్లో రిలీజ్ అవుతున్న సినిమా
Dasara song promo released

నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'దసరా' రెడీ అవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. నాని జోడీగా నటించడం ఆమెకి ఇది రెండోసారి. ఈ సినిమా కోసం నాని అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. 

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన రిలీజ్ చేయనున్నారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఈ ఐదు భాషల్లోను సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. 'చెమ్కీల అంగీలేసి ఓ వదినా చాకులెక్క ఉండేటోడే' అంటూ ఈ పాట సాగుతోంది. 

జానపద బాణీలో ఈ పాట నడుస్తోంది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. పూర్తి పాటను ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నారు. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ స్థాయి మాస్ లుక్ తో నాని కనిపించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాపై అంచనాలైతే ఒక రేంజ్ లోనే ఉన్నాయి.

More Telugu News