Rajasthan: కోడలితో మామ ప్రేమాయణం.. కొడుకుకు ఊహించని షాక్

Rajasthan man elopes with daughter in law on sons bike
షార్ట్స్‌లో చూడండి
రాజస్థాన్‌లోని బుందీ జిల్లాలో తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కోడలితో ప్రేమలో పడ్డ ఓ వ్యక్తి కొడుకు బైక్‌పై ఆమెను తీసుకుని ఇంట్లోంచి పారిపోయాడు. తండ్రి చేసిన నమ్మకద్రోహం నుంచి తేరుకోలేకపోయిన కొడుకు చివరకు పోలీసులు ఆశ్రయించాడు. తన భార్య అమాయకురాలని, తప్పంతా తండ్రిదే అంటూ కేసు పెట్టాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. సిలోర్ గ్రామానికి చెందిన పవన్ వైరాగికి భార్య, ఆరు నెలల కూతురు ఉన్నారు. అయితే.. అతడి తండ్రి రమేశ్ వైరాగి తన కోడలికి దగ్గరయ్యాడు. ఇటీవల ఓ రోజు ఆమెను తీసుకుని కొడుకు బైక్‌పై వెళ్లిపోయాడు. దీంతో..పవన్‌కు ఊహించని షాక్ తగిలింది. తండ్రే తన భార్యను తప్పుదారి పట్టించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య అమాయకురాలని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. తన తండ్రి కొన్ని చట్టవ్యతిరేకమైన పనులు కూడా చేసేవాడని ఆరోపించాడు. ఉద్యోగం కారణంగా తాను ఇంటికి దూరంగా ఉంటున్న సమయంలో ఈ ఘోరం జరిగిందని వాపోయాడు. తన భార్యతో పాటూ ద్విచక్రవాహనాన్ని కూడా తీసుకుని వెళ్లిపోయాడని ఫిర్యాదు చేశాడు. అయితే.. తన ఫిర్యాదుపై పోలీసులు సీరియస్‌గా తీసుకోవట్లేదని కూడా ఆరోపించాడు. 

ఈ ఉదంతంపై స్థానిక పోలీసులు స్పందించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ మామ, కోడలి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా..కొంత కాలం రాజస్థాన్‌లోని సిరోహీ జిల్లాలో ఇలాంటి కేసు ఒకటి సంచలనం రేపింది. ఓ మహిళ తన అల్లుడితో ప్రేమలో పడి అతడిని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. తన భర్తకు పూటుగా మద్యం తాగించి అతడు ఆదమరచి నిద్రపోతున్న సమయంలో ఉడాయించింది.
Go Back to Shorts
Rajasthan

More Telugu News