Kalyan Ram: నెట్ ఫ్లిక్స్ లో 'అమిగోస్' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..!

  • ఫిబ్రవరి 10వ తేదీన వచ్చిన 'అమిగోస్'
  • మూడు పాత్రల్లో కనిపించిన కల్యాణ్ రామ్
  • ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన ఆషిక రంగనాథ్ 
  • ఏప్రిల్ 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
Amigos will sream in OTT from April

కల్యాణ్ రామ్ కథనాయకుడిగా రూపొందిన 'అమిగోస్' ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీవారు నిర్మించిన ఈ సినిమా ద్వారా రాజేంద్రరెడ్డి అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. ఒక వ్యక్తిని పోలినవారు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అనే కాన్సెప్ట్ ను కనెక్ట్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. 
 
ఈ సినిమాలో కల్యాణ్ రామ్ మూడు పాత్రలలో కనిపించడం విశేషం. ఈ సినిమాతో తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమైంది. గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులు పడ్డాయి కూడా. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు.

నిజానికి ఒక ఇంట్రెస్టింగ్ లైన్ తోనే ఈ సినిమా రూపొందింది. కల్యాణ్ రామ్ మూడు పాత్రల మధ్య వైవిధ్యం కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. పాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకి టైటిల్ మైనస్ అయిందనే టాక్ బలంగా వినిపించింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ సినిమాకి ఆదరణ లభించే అవకాశాలు ఎక్కువేనని చెప్పాలి. 

More Telugu News