ఒక కాలు చంఢీగఢ్‌లో.. మరో కాలు హర్యానాలో పెట్టాడంటూ ఆసీస్ బ్యాటర్‌పై శ్రేయస్ అయ్యర్ కామెంట్
- మూడో టెస్టు లక్ష్య ఛేదనలో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ స్టాన్స్ పై శ్రేయస్ స్లెడ్జింగ్
- స్టంప్ మైక్ లో రికార్డయిన శ్రేయస్ వ్యాఖ్యలు వైరల్
- హిందీ అర్థం కాకపోవడంతో పట్టించుకోని హెడ్
కాగా, ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఛేజింగ్‌లో శ్రేయస్ అయ్యర్.. ట్రావిస్ హెడ్‌ని స్లెడ్జింగ్ చేశాడు. హెడ్ బ్యాటింగ్ స్టాన్స్ గురించి అయ్యర్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు స్టంప్ మై క్ లో రికార్డయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆరో ఓవర్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్ ను హెడ్ ఎదుర్కొంటున్న సమయంలో షార్ట్ ఫైన్ లెగ్ వద్ద నిలబడి ఉన్న శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు మైక్ లో రికారయ్యాయి. హెడ్ కాలు ఒకటి చండీగఢ్లో ఉంటే మరోటి హర్యానాలో ఉంది అంటూ శ్రేయస్ చేసిన కామెంట్ కు తోటి భారత ఆటగాళ్లంతా నవ్వుకున్నారు. అయితే, హిందీ అర్థం కాకపోవడంతో హెడ్ స్పందించకుండా తన పని తాను చేసుకెళ్లాడు.