బచ్చుల అర్జునుడు పాడె మోసిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు
Advertisement

బచ్చుల అర్జునుడు పాడె మోసిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు

Chandrababu lifts Bachula Arjunudu mortal
  • నిన్న కన్నుమూసిన బచ్చుల అర్జునుడు
  • కడసారి చూసేందుకు తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు
  • కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో టీడీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. కాసేపట్లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను కడసారి చూసుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కేశినేని నాని, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, కొనకళ్ల నారాయణ తదితరులు ఆయన నివాసం వద్దకు వచ్చారు. కాసేపటి క్రితం ఆయన అంతిమయాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా బచ్చుల అర్జునుడు పాడెను చంద్రబాబు, అచ్చెన్నాయుడు మోశారు. కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
Advertisement
Chandrababu
Atchannaidu
Bachula Arjunudu
Telugudesam

More Telugu News