టీడీపీ ఎమ్మెల్సీ మృతి పట్ల సంతాపం ప్రకటించిన జగన్
- నిన్న మృతి చెందిన బచ్చుల అర్జునుడు
- జనవరి 28న గుండెపోటుకు గురైన బచ్చుల
- సంతాపం ప్రకటించిన గవర్నర్, సీఎం
మరోవైపు బచ్చుల అర్జునుడు మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. బచ్చుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా బచ్చుల మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.