నిజం గెలుస్తుంది..: గౌతమ్ అదానీ

Gautam Adani responds on supreme court orders
  • సుప్రీంకోర్టు ఆదేశాలను అదానీ గ్రూప్ ఆహ్వానిస్తోందన్న గౌతమ్ అదానీ 
  • నిర్దేశిత సమయంలోగా దీనికి ముగింపు వస్తుందని వ్యాఖ్య
  • ట్విట్టర్ లో ట్వీట్ చేసిన గౌతమ్ అదానీ
హిండెన్ బర్గ్ ఆరోపణలపై సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించడాన్ని.. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆహ్వానించారు. ‘‘గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశాలను అదానీ గ్రూప్ ఆహ్వానిస్తోంది. ఒక నిర్దేశిత సమయంలోగా దీనికి ముగింపు వస్తుంది. నిజం గెలుస్తుంది’’ అంటూ గౌతమ్ అదానీ తన స్పందన తెలియజేశారు. ట్విట్టర్ లో దీనిపై ట్వీట్ పెట్టారు.

మీరు తప్పకుండా విజయం సాధిస్తారు.. అదానీ గ్రూప్ ఎదుగుతున్న విధానం గొప్పగా ఉందంటూ, యూపీ, ఎంపీలోనూ మౌలిక సదుపాయాల కల్పనపై అదానీ గ్రూప్ దృష్టి సారించాలని.. అదానీ గ్రూప్ పై తమకు నమ్మకం ఉందని.. ఇలా ఫాలోవర్లు తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. హిండెన్ బర్గ్ సంస్థ అదానీ గ్రూప్ పై చేసిన నిబంధనల ఉల్లంఘనలను తేల్చాలంటూ సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిపుణుల కమిటీని సైతం నియమించింది.
Go Back to Shorts
Gautam Adani
response
report
hindenburg

More Telugu News