కోహ్లీ, భరత్ కూడా ఔట్... లంచ్ విరామానికి 84/7తో నిలిచిన భారత్
- టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- ఆసీస్ స్పిన్నర్లు కునెమన్, లైయన్ చెరో 3 వికెట్లు
- తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన టీమిండియా
ఈ దశలో క్రీజులో వచ్చిన విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకున్నా.. వికెట్ల పతనం ఆగలేదు. రవీంద్ర జడేజా (4)ను లైయన్ ఔట్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ (0)ను కునెమన్ డకౌట్ చేయడంతో భారత్ 11.2 ఓవర్లలో 45 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ (17) తో కలిసి విరాట్ కోహ్లీ (22) ఆరో వికెట్ కు 25 పరుగులు జోడించడంతో భారత్ కోలుకునేలా కనిపించింది. కానీ, 22వ ఓవర్లో కోహ్లీని ఎల్బీ చేసిన మర్ఫీ ఈ జోడీని విడదీశాడు. ఆ వెంటనే లైయన్ బౌలింగ్ లో కేఎస్ భరత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం అక్షర్ పటేల్ (6), అశ్విన్ (1) క్రీజులో ఉన్నారు. కాగా, తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత్ నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో ప్రస్తుతం 2–0తో ఆధిక్యంలో ఉంది.