అలనాటి శృంగార తార జయమాలిని ఇంట పెళ్లి సందడి
- 80వ దశకంలో ఒక వెలుగు వెలిగిన జయమాలిని
- రేపు జయమాలిని కుమారుడు హరి వివాహం
- పెళ్లికి తరలిరానున్న అలనాటి నటీనటులు
జయమాలిని, పార్తీబన్ ల పిల్లలు కూడా ఉన్నత విద్యావంతులే. వారి కుమారుడు హరి స్పెయిన్ లో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఇప్పుడు ఆయన వివాహం జరగబోతోంది. చెన్నైకి చెందిన ప్రియాంకతో మద్రాస్ వీజీపీ గోల్డెన్ బీచ్ రిసార్ట్స్ లో రేపు వివాహం జరగనుంది. ఈ రాత్రి అక్కడే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వివాహ వేడుకకు అలనాటి నటీనటులు హాజరుకానున్నారు. పెళ్లి కూతురు ప్రియాంక ఇంజినీరింగ్ చేసిన తర్వాత ఐఐఎంలో ఎంబీఏ చేసింది.