వచ్చేస్తున్నాయ్.. టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు.. వీడియో ఇదిగో!
- బస్సులో 30 బెర్తులు
- వై-ఫై సౌకర్యం.. సీసీ కెమెరాలు కూడా
- అగ్ని ప్రమాదాలను ముందే గుర్తించగలిగే ఫైర్ డిటెక్షన్ సిస్టం ఏర్పాటు
- మార్చి నుంచి అందుబాటులోకి 16 బస్సులు
- విశాఖ, తిరుపతి, బెంగళూరు, చెన్నై, హుబ్బళ్లి నగరాలకు నడవనున్న బస్సులు
లహరి స్లీపర్ బస్సు ప్రత్యేకతలివే..
12 మీటర్ల పొడవుండే బస్సులో కింద 15, పైన 15 చొప్పున మొత్తం 30 బెర్తులు ఉంటాయి. ప్రతి బెర్త్‌కు సెల్‌ఫోన్ చార్జింగ్ సదుపాయం, వాటర్ బాటిల్ పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. అలాగే, వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతోపాటు పానిక్ బటన్ కూడా ఉంటుంది. అత్యవసర సమయాల్లో దీనిని వినియోగించవచ్చు. బస్సులో వై-ఫై సదుపాయం, భద్రత కోసం రెండు సీసీ కెమెరాలు ఉంటాయి. అగ్ని ప్రమాదాలను ముందే గుర్తించగలిగే ఫైర్ డిటెక్షన్ సిస్టం కూడా ఈ బస్సుల్లో ఉంటుంది.