Tamilisai Soundararajan: నడుస్తూ కిందపడిపోయిన గవర్నర్ తమిళిసై

  • తమిళనాడులో ఓ కార్యక్రమానికి హాజరైన తమిళిసై
  • నడుస్తుండగా కాలు స్లిప్ అయిన వైనం
  • ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
Tamilisai falls while walking

తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై ఓ కార్యక్రమంలో అదుపుతప్పి కాలుజారి కిందపడిపోయారు. మామల్లపురం సమీపంలోని పత్తిపుల గ్రామంలో నిన్న హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమం జరిగింది. ఇది మన దేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం. ఈ కార్యక్రమానికి తమిళిసై హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించి నడుస్తుండగా కాలు స్లిప్ అయి కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను లేపి నిలుచోబెట్టారు. ఈ ఘటనలో ఆమెకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై ఆమె మాట్లాడుతూ... తనకు ఎలాంటి గాయాలు కాకపోయినా తాను కింద పడిపోయినందుకు టీవీల్లో ఈ వార్త హైలైట్ అవుతుందని సరదాగా వ్యాఖ్యానించారు.

More Telugu News