తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం

Accident in Tirumala second ghat road
  • ముందు వెళుతున్న జీపు, బైక్ ను తప్పించబోయిన బస్సు
  • అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టిన వైనం
  • ఉద్యోగులు, శ్రీవారి భక్తులకు స్వల్ప గాయాలు
ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమల రెండో ఘాట్ రోడ్డులో నేడు బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న జీపు, బైక్ ను తప్పించబోయిన బస్సు ఘాట్ రోడ్డు పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఉద్యోగులు, శ్రీవారి భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. భాష్యకారుల సన్నిధి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటన స్థలిలో ఎడమవైపు లోయ ఉండగా, కుడివైపున కొండరాయి ఉంది. కాగా, బస్సును అక్కడి నుంచి తొలగించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది.
Go Back to Shorts
Tirumala
Road Accident
Ghat Road
Bus
TTD

More Telugu News