Chandrababu: అన్నింటికి పేర్లు, రంగులు మార్చడం ఆయనకున్న మానసిక జబ్బేమో!: చంద్రబాబు

Chandrababu satires on removal of Tummalapalli and Kshetraiah names in Kalakshetram in Vijayawada
షార్ట్స్‌లో చూడండి
విజయవాడలోని ప్రఖ్యాత 'తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం'లో తుమ్మలపల్లి, క్షేత్రయ్యల పేర్లను తొలగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎం జగన్ పై సాహితీప్రియులు మండిపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. స్థలం ఇచ్చిన దాత తుమ్మలపల్లి శ్రీహరి గారి పేరు, వాగ్గేయకారుడు క్షేత్రయ్య పేరు... రెండూ తీసేశారని మండిపడ్డారు. కళాక్షేత్రానికి కూడా ఏ దోపిడీదారుడి పేరో పెడతారనుకుంటా అని సెటైర్ వేశారు. ఇలా అన్నింటికి పేర్లు, రంగులు మార్చడం ఆయనకున్న జబ్బేమో! అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
Go Back to Shorts
Chandrababu
Tummalapalli Kalakshetram
Name
Vijayawada

More Telugu News