అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి

3 Dead In Michigan State University Shooting
  • మిషిగన్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం
  • గాయాలపాలైన మరో ఐదుగురు  
  • నిందితుడి కోసం పోలీసుల విస్తృత గాలింపు
అమెరికాలో మళ్లీ తూటా పేలింది. ప్రముఖ మిషిగన్ స్టేట్ యూనివర్సిటీలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. యూనివర్సిటీలోని బర్కీ హాల్, యూనియన్ బిల్డింగ్‌లో నిందితుడు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, ఐదుగురు గాయాలపాలయ్యారు. 

కాల్పుల సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఒక్కో భవనాన్ని తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి మాస్క్ పెట్టుకున్నట్టు యూనివర్సిటీ పోలీసు అధికారి రాజ్‌మన్ తెలిపారు. యూనియన్ బిల్డింగ్‌ నుంచి నిందితుడు కాలినడకన వెళ్లిపోవడాన్ని కొందరు చివరిసారిగా చూసినట్టు చెప్పారు. 

గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోని వారు ఇళ్లల్లో జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు సూచించారు. అంతేకాకుండా.. 48 గంటల పాటు యూనివర్సిటీలో క్లాసులు, ఇతర క్యాంపస్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. 

అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ కూడా ఒకటి. ఇక్కడి ఈస్ట్ లాన్సింగ్ క్యాంపస్‌లో సుమారు 50 వేల మంది గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు చదువుకుంటున్నారు. 

Advertisement
USA

More Telugu News