ఏపీ నుంచి బిశ్వభూషణ్ వెళ్లడం బాధాకరం: సీఎం జగన్
- బిశ్వభూషణ్ తో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్న జగన్
- ఆయనతో తనది ఆత్మీయ అనుబంధమని వ్యాఖ్య
- ఏపీకి ఎంతో సేవ చేశారని కితాబు
బిశ్వభూషన్ బదిలీ కావడంపై స్పందిస్తూ... ఆయనతో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని జగన్ చెప్పారు. ఆయనతో తన అనుబంధం ఆత్మీయతతో కూడుకున్నదని అన్నారు. రాష్ట్రం నుంచి ఆయన వెళ్లిపోవడం బాధాకరమని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సజావుగా సాగడంలో బిశ్వభూషణ్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఏపీకి ఆయన చేసిన సేవలకుగాను కృతజ్ఞతలను తెలియజేస్తున్నానని చెప్పారు. ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా కొత్త బాధ్యతలను స్వీకరించబోతున్న బిశ్వభూషణ్ కు అభినందనలు తెలియజేశారు.