చంద్రబాబును కలిసిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు
- చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన రైతులు
- ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని వెల్లడి
- రూ.18 లక్షల పరిహారం చెల్లించనేలేదని వివరణ
ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ, 2004 తర్వాత కాంగ్రెస్ హయాంలో పనులు జరగలేదని అన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం చేశామని వెల్లడించారు. మిగిలిన 10 శాతం పనులు కూడా జగన్ పూర్తిచేయలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజితో పాటు అన్ని విధాలా న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.