ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక వ్యక్తి అరెస్ట్
- ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు
- వ్యాపారవేత్త గౌతం మల్హోత్రాను అరెస్ట్ చేశామంటూ ప్రకటన
- మద్యం విధానంలో మార్పుల వెనుక గౌతం హస్తం ఉందని ఆరోపణ
గత రాత్రి గౌతమ్ మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న ఈడీ.. నేడు అధికారికంగా ఆయన అరెస్టును ప్రకటించినట్టు సమాచారం. అధికారులు ఆయనను బుధవారం మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. గౌతమ్ మల్హోత్రాకు మద్యం వ్యాపారులతో సన్నిహిత వ్యాపార సంబంధాలు ఉన్నట్లు పలు ఆధారాలు లభ్యమయ్యాయని ఈడీ తెలిపింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన పలువురు నేతలతో డబ్బు లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొంది. మద్యం విధానం రూపకల్పనకు సంబంధించిన వ్యవహారాల్లో గౌతమ్ ప్రమేయం ఉన్నట్టు ఈడీ తెలిపింది.