టాలీవుడ్ లో అడుగుపెట్టిన మరో కేరళ బ్యూటీ!

Gouri special
  • ఈ నెల 18న రిలీజ్ అవుతున్న 'శ్రీదేవి శోభన్ బాబు'
  • నిర్మాతగా చిరంజీవి కూతురు సుస్మిత 
  • సంతోష్ శోభన్ జోడీగా గౌరీ కిషన్ 
  • తెలుగులో ఆమెకి ఇదే ఫస్టు మూవీ
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా పెద్దది. మిగతా భాషలతో పోలిస్తే ఆర్టిస్టులకు ఇక్కడ లభించే గౌరవం .. పారితోషికం రెండూ ఎక్కువే. అందువలన ఇతర భాషల్లోనివారు ఇక్కడ నటించడానికి ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలా ఇక్కడికి వచ్చి తమ జోరును చూపుతున్న ముద్దుగుమ్మలలో కేరళ బ్యూటీలు ఎక్కువ. 

అక్కడి నుంచే ఇప్పుడు మరో సుందరి రంగంలోకి దిగింది .. ఆ బ్యూటీ పేరే గౌరీ కిషన్. 'జాను' సినిమాలో మెరిసిన ఆమె, 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. చిరంజీవి పెద్ద కూతురు - అల్లుడు ఏర్పాటు చేసిన కొత్త బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. అలాంటి ఈ సినిమాకి ప్రశాంత్ దిమ్మల దర్శకత్వం వహించాడు. 

శ్రీదేవి - శోభన్ బాబు విలేజ్ నేపథ్యంలో నడిచే కథ. లవ్ డ్రామా జోనర్లో ఈ కథ నడుస్తుంది. సంతోష్ శోభన్ హీరోగా నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన విడుదల కానుంది. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఈ సుందరి ఎన్ని మార్కులను సంపాదించుకుంటుందనేది చూడాలి. ఇక వరుస ఫ్లాపులతో ఉన్న సంతోష్ శోభన్ కి కూడా ఈ సినిమా హిట్ అవ్వడం అన్నది చాలా అవసరమే.
Advertisement
Gouri
Santhosh Sobhan
Sridevi Sobhan Babu

More Telugu News