కొంటె చూపులతో కట్టిపడేస్తున్న కోలీవుడ్ బ్యూటీ .. లేటెస్ట్ పిక్స్!

Chandini Tamilarasan Special
  • కోలీవుడ్ లో జోరు చూపుతున్న చాందినీ 
  • టాలీవుడ్ లో పట్టు సాధించే ప్రయత్నాలు
  • యూత్ హృదయాలను కొల్లగొడుతున్న లేటెస్ట్ పిక్స్ 
  • సీనియర్ స్టార్స్ జోడీగా మెప్పించే ఫిజిక్ ఆమె సొంతం
మొదటి నుంచి కూడా తెలుగు తెరపై కోలీవుడ్ భామల జోరు కనిపిస్తూనే వస్తోంది. తెలుగు .. తమిళ భాషల సినిమాలకి మధ్య ఉన్న దగ్గర సంబంధమే అందుకు కారణం. అందువలన ఈ రెండు భాషలకి చెందిన సినిమాలతో కథానాయికలు బిజీగా ఉంటూ ఉంటారు. తెలుగు తెరపై కాస్త పట్టు దొరికితే అల్లుకుపోవడానికి ట్రై చేస్తుంటారు. అలా తెలుగులో సినిమాల్లో సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న భామగా చాందినీ తమిళరసన్ కనిపిస్తుంది. 2010లోనే చాందినీ కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అప్పటి నుంచి అక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. తెలుగులో కూడా మూడు నాలుగు సినిమాలు చేసిందిగానీ .. ఆ పాత్రలు ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేకపోయాయి. అందువల్లనే ఆమె మరింత పట్టుదలతో గట్టిగానే ట్రై చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె లేటెస్ట్ పిక్స్ వదిలారు. మంచి హైటూ .. ఆకర్షణీయమైన రూపం .. ఆకట్టుకునే కళ్లు అమ్మడి ప్రత్యేకతలుగా కనిపిస్తున్నాయి. సీనియర్ స్టార్స్ జోడీగానే కాదు .. ఐటమ్ సాంగ్స్ లోను ఆకట్టుకోగలదని అనిపిస్తోంది. చూడాలి మరి తెలుగులో ఆమెకి సరైన బ్రేజ్ వస్తుందేమో..
Advertisement
Chandini
Actress
Kollywood

More Telugu News