అభిమానులూ .. అరగంటకోసారి అప్ డేట్ ఇవ్వలేను: ఎన్టీఆర్

Amigos movie pre release event
  • 'అమిగోస్' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా వచ్చిన ఎన్టీఆర్ 
  • కల్యాణ్ రామ్ ప్రత్యేకత గురించిన ప్రస్తావన 
  • ఆ క్రెడిట్ ఆయనకే చెందుతుందని వ్యాఖ్య 
  • అప్ డేట్స్ అంటూ అభిమానులు ఒత్తిడి చేయోద్దన్న ఎన్టీఆర్ 
కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'అమిగోస్' ఈ నెల 10వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ .. "నాకు ఒంట్లో బాగోలేకపోయినా .. మీ అందరినీ చూడాలనే ఉద్దేశంతో వచ్చాను. బాడీ పెయిన్స్ వలన ఎక్కువ సేపు నిలబడలేను కూడా .. ప్లీజ్ అర్థం చేసుకోండి" అన్నారు.  

"ఈ సినిమా డైరెక్టర్ రాజేంద్రగారు ఇంజనీరింగ్ చేశారు. ఒక సినిమాను డైరెక్ట్ చేసిన తరువాతనే ఇంటికి తిరిగి వస్తానని ఆయన పేరెంట్స్ తో చెప్పారు. అయితే ఈ సినిమా పూర్తయ్యేలోగా ఆయన పేరెంట్స్ కాలం చేశారు. ఒక సినిమా పట్ల ఎంత అంకితభావం ఉండాలనేది ఆయనను చూసిన తరువాత నాకు అర్థమైంది" అని చెప్పారు. 

"రాజేంద్ర గారు సాధించిన విజయాన్ని ఆయన తల్లిదండ్రులు తప్పక చూస్తారు .. ఆయన కోసమైనా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆషికకి ఇది సరైన సినిమా అని అనుకుంటాను. ఆమె విభిన్నమైన పాత్రలు చేయాలని  కోరుకుంటున్నాను" అని అన్నారు.  

"మా ఫ్యామిలీలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ, అందరి కంటే ప్రయోగాత్మకమైన పాత్రలను చేసింది కల్యాణ్ ఒక్కడే. హీరోగా .. నిర్మాతగా కూడా ప్రయోగాత్మకమైన .. ప్రయోజనాత్మకమైన సినిమాలు చేసింది ఆయనే. మూడు విభిన్నమైన పాత్రలను చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఈ సినిమా తప్పకుండా ఆయన కెరియర్లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది" అని చెప్పారు.  

"నా సినిమా గురించి అడుగుతున్నారు .. అభిమానులు కాస్త ఓపిక పట్టాలి. ప్రతో రోజు .. ప్రతి పూట .. ప్రతి గంట అప్ డేట్ ఇవ్వడం కుదరదు. మీ ఉత్సాహం .. ఆరాటం వలన దర్శక నిర్మాతలపై ఎక్కువ ఒత్తిడి పడుతోంది. నిజంగా ఆప్ డేట్ ఏదైనా ఉంటే ఇంట్లో ఉండే నా భార్యకంటే మీకే ముందుగా చెబుతాను" అని అన్నారు. 

Go Back to Shorts
Kalyanram
Ashika Ranganath
Amigos

More Telugu News