ఎన్టీఆర్ లాంటివాడు మళ్లీ పుట్టడు: 'అమిగోస్' ప్రీ రిలీజ్ ఈవెంటులో బ్రహ్మాజీ!

Amigos pre release event
  • కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'అమిగోస్'
  • మనిషిని పోలిన మనుషుల మధ్య జరిగే కథ 
  • హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ నెల 10వ తేదీన సినిమా రిలీజ్
కల్యాణ్ రామ్ హీరోగా 'అమిగోస్' సినిమా రూపొందింది. మైత్రీ మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమాతో ఆషిక రంగనాథ్ కథానాయికగా పరిచయమవుతోంది. 

ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో నిర్వహించారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన బ్రహ్మాజీ మాట్లాడుతూ .. "ఇంతవరకూ చాలా కూల్ గా కనిపిస్తూ వచ్చిన కల్యాణ్ రామ్, ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపిస్తాడు. ఈ సినిమాలో చేసే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అన్నాడు. 

"డైరెక్టర్ రాజేంద్రరెడ్డి ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింటుతో వస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. మనిషిని పోలిన మనుషులు ఉంటారనే కాన్సెప్టుతో ఈ సినిమా వస్తోంది. కానీ ఎన్టీఆర్ ను పోలిన మనిషంటూ ఎక్కడా ఉండడు .. అసలు అలాంటివాడు మళ్లీ పుట్టడు" అని చెప్పుకొచ్చాడు. స్టేజ్ పై మోకాళ్లపై కూర్చుని ఆయన చేసిన డాన్స్ అందరినీ నవ్వించింది..
Advertisement
Kalyanram
Ashika Ranganath
Amigos Movie

More Telugu News