ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం.. అనంతరం నాందేడ్ కు పయనమవనున్న కేసీఆర్
- రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
- రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
- ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ తమిళిసై
ఈ నెల 5వ తేదీన నాందేడ్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భారీ సభను నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత తెలంగాణ వెలుపల ఆ పార్టీ నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడం గమనార్హం. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రసంగించనున్నారు.