కరోనా చికిత్సకు ప్రపంచం పెట్టిన ఖర్చు తెలిస్తే గుండె గుభేల్!
- రూ. 30.38 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా
- కరోనా సమయంలో 810 శాతం పెరిగిన చికిత్స వ్యయం
- అమెరికాలో ఒక్కో వ్యక్తికి సగటున రూ. రూ.16.81 లక్షలు ఖర్చు
కరోనా సమయంలో ఆమెరికాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తి సగటున రూ.16.81 లక్షలు ఖర్చు చేశారని ఈ నివేదిక పేర్కొంది. అత్యల్పంగా సోమాలియాలో రూ.733 ఖర్చు పెట్టారని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కొవిడ్ మరణాల్లో 27.2 శాతం భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్థాన్‌లలోనే చోటుచేసుకున్నాయని తెలిపింది. ఈ సమయంలో భారత పౌరులు ఆరోగ్యంపై పెట్టిన తలసరి ఖర్చు సగటు రూ.5678 కాగా, ప్రభుత్వం పెట్టిన ఖర్చు సగటు రూ.2706గా ఉంది. భారత్‌లో ఒక్కో వ్యక్తి తన ఆరోగ్యానికి పెట్టే సగటు ఖర్చు 2026 నాటికి రూ.7626కు చేరే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొన్నది.