అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఆదోని యువతి మృతి
- సియాటిల్ నగరంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదం
- పోలీస్ వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి
- కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిగా గుర్తించిన పోలీసులు
సియాటిల్ లో ఉంటున్న కందుల జాహ్నవి.. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో థామస్ స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన పోలీస్ వాహనం ఆమెను ఢీ కొట్టింది. దీంతో జాహ్నవికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తుండగా.. జాహ్నవి మరణించింది. కాగా, ఈ ప్రమాదానికి కారణమైన అధికారి 2019 నుంచి విధులు నిర్వహిస్తున్నాడని సియాటిల్ పోలీసులు చెప్పారు. అయితే, అతని వివరాలను మాత్రం వారు బయటపెట్టలేదు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.