Currency Notes: బెంగళూరులో నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం... వీడియో ఇదిగో!

  • కేఆర్ మార్కెట్ వద్ద ఘటన
  • సిర్సి ఫ్లై ఓవర్ పైనుంచి డబ్బులు వెదజల్లిన వ్యక్తి
  • నోట్లు అందుకునేందుకు పోటీలు పడిన ప్రజలు
  • భారీగా ట్రాఫిక్ జామ్
Man throws currency notes in Bengaluru

బెంగళూరులో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. నగరంలో నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. కేఆర్ మార్కెట్ వద్ద సిర్సి సర్కిల్ ఫ్లై ఓవర్ పైనుంచి ఓ వ్యక్తి కరెన్సీ నోట్లు జనంపైకి విసిరేశాడు. ఆ నోట్లను అందుకునేందుకు ప్రజలు పోటీలు పడ్డారు. వాహనాలు ఆపి మరీ రోడ్డుపై నోట్ల వేట సాగించారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 

నోట్లు విసిరిన వ్యక్తి సూటుబూటు ధరించి మెడలో ఓ గోడ గడియారాన్ని తగిలించుకుని విచిత్ర వేషధారణతో కనిపించాడు. చేతి సంచి నిండా ఉన్న కరెన్సీ నోట్లను ఫ్లై ఓవర్ పైనుంచి వెదజల్లుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  కాగా, ఆ వ్యక్తి వెదజల్లింది రూ.10 నోట్లు అని తెలుస్తోంది.

More Telugu News