Venkatesh Daggubati: తన 75వ చిత్రాన్ని ‘హిట్2’ దర్శకుడు శైలేష్ చేతిలో పెట్టిన విక్టరీ వెంకటేశ్​

  • నిర్మాతగా వెంకట్ బోయనపల్లి
  • ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసిన నిహారిక ఎంటర్ టైన్ మెంట్ 
  • ఈ నెల 25న అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రకటన
Victory Venkatesh 75th Land Mark Film with Shailesh kolanu

టాలీవుడ్ సీనియర్, విక్టరీ వెంకటేశ్ తన 75వ సినిమాపై సస్పెన్స్ కు తెరదించారు. ‘హిట్2’తో ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు శైలేష్ కొలనుతో ఆయన ఈ చిత్రాన్ని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి దీనిని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని నిహారిక ఎంటర్ టైన్ మెంట్ సోమవారం వెల్లడించింది. 

సినిమాకు సంబంధించిన ప్రీలుక్‌ పోస్టర్‌ను కూడా ఈ రోజు రిలీజ్‌ చేసింది. చొక్కామడిచి విస్పోటనానికి ఎదురు వెళ్తున్నట్టుగా ఉన్న వెంకీ బ్యాక్ షాట్ పోస్టర్ చూస్తే ఇది యాక్షన్ సినిమాలా కనిపిస్తోంది. ఈ నెల 25వ తేదీన సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని చిత్ర బృందం ట్వీట్ చేసింది. ఆ రోజే ఇతర తారాగణం గురించి వెల్లడించే అవకాశం ఉంది. కాగా, వెంకీ చివరగా విష్వక్సేన్ హీరోగా నటించిన ‘ఓరి దేవుడా’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించారు.

More Telugu News