అమెరికాలో చైనా నూతన సంవత్సర వేడుకలు రక్తసిక్తం... దుండగుడి కాల్పుల్లో పలువురి మృతి
- మాంటెరీ పార్క్ లో లూనార్ ఫెస్టివల్
- తుపాకీతో వచ్చిన దుండగుడు
- విచక్షణరహితంగా కాల్పులు
- 10 మంది మృతి!
- పరారీలో దుండగుడు
మాంటెరీ పార్క్ నగరంలో ఆసియా సంతతి వారు అధికంగా ఉంటారు. మాంటెరీ పార్క్ నగరం లాస్ ఏంజెల్స్ డౌన్ టౌన్ కు 16 కిమీ దూరంలో ఉంటుంది. కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.