రాహుల్ గాంధీని ఆదిశంకరాచార్యులతో పోల్చిన ఫరూక్ అబ్దుల్లా.. మండిపడిన బీజేపీ
- కశ్మీర్ చేరుకున్న రాహుల్ భారత్ జోడో యాత్ర
- ఆదిశంకరాచార్యుల తర్వాత ఆ ఘనత సాధించింది రాహులేనన్న ఫరూక్
- రాహుల్ యాత్రను వ్యతిరేకించేవారు మానవాళికి శత్రువులని వ్యాఖ్య
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘హిందూ ఉగ్రవాదం’, ‘కాషాయ ఉగ్రవాదం’ పదాల సృష్టికర్త అయిన రాహుల్‌ను శంకరాచార్యులతో పోల్చడం తగదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి హెహజాద్ పూనావాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, భారత్ జోడో యాత్ర కశ్మీర్ చేరుకోవడంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. చాలా ఆనందంగా ఉందని, సొంతింటికి వచ్చిన భావన కలుగుతోందని అన్నారు. తన మూలాలు ఇక్కడే ఉన్నాయని ట్వీట్ చేశారు.