ప్రపంచ వృద్ధురాలి ఆరోగ్య రహస్యాలు
- స్పెయిన్ వాసి మారియా బ్రన్యాస్ మొరెరాకు 115 ఏళ్లు
- గుర్తించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
- క్రమబద్ధమైన జీవనం, ఆందోళన లేకపోవడం, ప్రశాంతతలే కారణమట
115 ఏళ్లపాటు జీవించి ఉండడం అంటే సాధారణ విషయమేమీ కాదు. అందుకు జన్యుపరంగా, జీవన పరంగా ప్రత్యేకతలు కచ్చితంగా ఉండి ఉంటాయి. 22 ఏళ్లుగా ఆమె ఒకే నర్సింగ్ హోమ్ లో జీవిస్తున్నట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తెలిపింది. అంతకాలం పాటు జీవించి ఉండడానికి దోహదపడిన అంశాలను కూడా తెలియజేసింది.
‘‘క్రమబద్ధమైన జీవనం, ప్రశాంతత, కుటుంబం, స్నేహితులతో మంచి సంబంధాలు, ప్రకృతితో మమేకం కావడం, భావోద్వేగాల పరంగా స్థిరత్వం, దేని గురించి ఆందోళన, భయం చెందకపోవడం, విచారించకపోవడం, ఎంతో సానుకూల దృక్పథం, హానికారక వ్యక్తులకు దూరంగా ఉండడం. దీనికితోడు అదృష్టం, మంచి జన్యువులు’’ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్వయంగా తెలిపింది.