బాలుడికి కల్వర్టుతో వివాహం.. అక్కడ అదో ఆచారం!

Jharkhand Tribals marry kids to culverts
  • ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఘటన
  • పిల్లలకు తొలి దంతం కనుక పైదవడకు వస్తే ఐదేళ్లలోపు అలాంటి వివాహం  
  • మకర సంక్రాంతి రెండో రోజున ఘనంగా వివాహం
  • ఐదేళ్ల లోపు పెళ్లి చేయకుంటే వివాహమయ్యాక భాగస్వామి మరణిస్తారని నమ్మకం
  • అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తున్న గిరిజనులు
ఝార్ఖండ్‌లోని గిరిజనులకు ఓ వింత ఆచారం ఉంది. పిల్లలకు తొలి దంతం కనుక పైదవడకు వస్తే ఐదేళ్లలోపు వారికి చెట్టుకు కానీ, కల్వర్టుకు కానీ ఇచ్చి పెళ్లి చేస్తారు. తాజాగా, ఓ బాలుడికి అలానే తొలి దంతం పైదవడకు రావడంతో ఘనంగా కల్వర్టుతో వివాహం జరిపించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని పోట్కా ప్రాంతానికి చెందిన సరీ సింగ్ సర్దార్ తన మనవడికి ఇలానే తొలి దంతం పైదవడకు వచ్చింది. దీంతో బాలుడిని పెళ్లికొడుకులా ముస్తాబు చేసి బొమ్మ బైక్‌పై ఊరేగిస్తూ కల్వర్టు వద్దకు తీసుకెళ్లి వివాహం జరిపించారు.

మకర సంక్రాంతి తర్వాత రెండో రోజు గిరిజనులు ఇక్కడ అఖన్న జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా బాలుడికి ఘనంగా వివాహం జరిపించారు. తొలి దంతం పైదవడకు వచ్చిన చిన్నారులకు కల్వర్టుకు కానీ, చెట్టుకు కానీ ఇచ్చి వివాహం జరిపించకుంటే పెళ్లయిన తర్వాత వారి భాగస్వామి మరణిస్తారని గిరిజనులు విశ్వసిస్తారు. అందుకే అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని గిరిజనులు ఇప్పటికీ పాటిస్తుంటారు. చిన్నారులకు ఐదేళ్లు వచ్చే లోపే వారికి వివాహం జరిపిస్తుంటారు.
Go Back to Shorts
Jharkhand
Tribes
Boy
Marriage
Culvert

More Telugu News