పొరుగు రాష్ట్ర మంత్రి దావోస్ లో ఉంటే.. ఏపీ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగితేలుతున్నాడు: బొండా ఉమ
- తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాడన్న ఉమ
- ఏపీ పరిశ్రమల మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నాడని విమర్శ
- దావోస్ సదస్సులో ఏపీకి ప్రాతినిధ్యం ఎందుకు లేదో జగన్ చెెప్పాలని డిమాండ్
జగన్ అహంకారపూరిత నిర్ణయం, ప్రతి పారిశ్రామికవేత్తలను ఆలోచించుకునేలా చేసింది. దానిప్రభావమే నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్కపరిశ్రమ రాకపోవడం' అని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో రూ. 5,17,000 కోట్ల పెట్టబడులు వచ్చాయన్న మేకపాటి గౌతమ్ రెడ్డి సమాధానంపై జగన్ రెడ్డి ఏం చెబుతాడు? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్ర మంత్రి (కేటీఆర్) దావోస్ లో పెట్టుబడులను ఆకర్షిస్తుంటే... ఏపీ మంత్రి విశాఖలో కోడిపందేలు, రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగితేలుతున్నాడని ఎద్దేవా చేశారు.
అన్నిరాష్ట్రాల పాలకులు దావోస్ వేదికపై తమ స్వరాలు వినిపిస్తున్నవేళ, జగన్ రెడ్డి తాడేపల్లిలో చిందులేస్తుంటే, పరిశ్రమల మంత్రి విశాఖపట్నంలో కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నాడని... సొంత పార్టీవారు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తల్ని కమీషన్ల కోసం వేధిస్తుంటే, ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నాడని మండిపడ్డారు. ఏపీ యువత బూమ్ బూమ్ బీర్లు అమ్ముతూ, మాంసం కొట్టుకుంటూ, గంజాయి పీలుస్తూ బతకాలన్నదే జగన్ రెడ్డి ఆలోచనా? అని ప్రశ్నించారు.