ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు
- ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
- ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న బీఆర్ఎస్ నాయకత్వం
- జాతీయస్థాయి నేతలకు ఆహ్వానం!
- తెలంగాణకు ఈశాన్య దిక్కులో సభ స్థానికులకే కలిసి వస్తుందన్న రేణుక
తెలంగాణకు ఈశాన్య దిక్కు స్థానికులకే కలిసి వస్తుందని, అది అందరికీ కలిసిరాదని వాస్తు గురించి ప్రస్తావించారు. బయటివాళ్లు ఖమ్మంలో సమావేశాలు పెడితే ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నిర్వహించే ఈ సభలో కేసీఆర్ వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. తెలంగాణను సర్వనాశనం చేసిన కేసీఆర్ ఈ సంవత్సరంలో అయినా వాస్తవాలు మాట్లాడడం అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నట్టు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.