'వాల్తేరు వీరయ్య' పండక్కి పర్ఫెక్ట్ సినిమా అంటున్నారు: డైరెక్టర్ బాబీ
- నేడే విడుదలైన 'వాల్తేరు వీరయ్య'
- మాస్ హీరోలుగా తెరపై సందడి చేసిన చిరూ - రవితేజ
- ఈ సినిమా తనకి గౌరవం తెచ్చిందన్న బాబీ
- థియేటర్స్ రెస్పాన్స్ పట్ల సంతోషం
ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోందంటూ, కొంతసేపటి క్రితం 'మాస్ బ్లాక్ బస్టర్ మీట్' ను నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు బాబీ మాట్లాడుతూ .. "ఈ సినిమా థియేటర్స్ కి వెళ్లాము .. అక్కడి రెస్పాన్స్ చూసిన తరువాత, మేము పడిన కష్టాన్ని మరిచిపోయాము. ఇంతకుముందు తీసిన సినిమాలకు నాకు పేరు మాత్రమే వచ్చింది. ఈ సినిమా వలన నాకు గౌరవం వచ్చింది" అని అన్నాడు.
"నేను అనుకున్నట్టుగానే ఈ సినిమా పూనకాలు తెప్పిస్తోంది. రిలీజ్ కి ముందే ఈ సినిమాపై మాకు నమ్మకం కలగడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్. అందరూ కూడా సాంగ్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు లైఫ్ ఇచ్చిన రవితేజ గారు ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా నాకు కాల్ చేసి, పండక్కి ఇది పెర్ఫెక్ట్ సినిమా అంటూ ఉంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు.