ఢిల్లీ మెట్రోలో ఈ యువతి చేష్టలు చూస్తే అవాక్కవ్వాల్సిందే!
- ఖాళీగా ఉన్న మెట్రోలో రెచ్చిపోయిన యువతి
- యోగాసనాలు, విన్యాసాలతో కేరింతలు
- మధ్యలో సీటు ఎక్కి డ్యాన్స్ లు
- అలా చేయకు అపర్ణా అంటూ నెటిజన్ల సలహా
మెట్రోలో ప్రయాణికులు కింద పడిపోకుండా పట్టుకునేందుకు ఆధారంగా ఉండే హ్యాండ్ రెయిలర్లను చేత్తో పట్టుకుని అటూ, ఇటూ ఉయ్యాల మాదిరి ఊగిపోయింది. మధ్యలో యోగసనాలు వేసింది. ఆ తర్వాత మెట్రోలో సీట్ పైకి ఎక్కి డ్యాన్స్ చేసింది. ఎవరైనా వస్తున్నారా అంటూ మధ్య మధ్యలో అటూ ఇటూ గమనించడం వీడియోలో చూడొచ్చు. మొత్తానికి మెట్రోను ఇల్లుగా మార్చుకున్న ఈ యువతి విషయంలో యూజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘అపర్ణా ఇలాంటివి చేయకు. చూసిన వారు కూడా ఇలానే చేస్తారు. దయచేసి సానుకూలంగా అర్థం చేసుకో’’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. (వీడియో కోసం)