VJ Sunny: వైరల్ అవుతున్న బిగ్ బాస్ ఫేమ్ సన్నీ వీడియో ఇదే!

  • డబ్బు కట్టలతో కారులో వెళ్లిపోయిన వీజే సన్నీ
  • బ్యాగు కిందపడగా, నోట్ల కట్టలు ఏరుతూ కెమెరా కంటికి చిక్కిన వైనం
  • సినిమా ప్రమోషన్ అయ్యుంటుందని ప్రచారం!
Bigg Boss fame VJ Sunny video viral

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-5 విజేత వీజే సన్నీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డబ్బు కట్టలతో ఉన్న ఓ బ్యాగును తీసుకెళుతుండగా, జారిపడడంతో ఆ నోట్ల కట్టలను మళ్లీ బ్యాగులో వేసుకుని సన్నీ తన కారులో వెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపించింది. ఇది ఓ అపార్ట్ మెంట్ దగ్గర కెమెరాల్లో రికార్డయినట్టు తెలుస్తోంది. అయితే ఇది నిజమైన వీడియోనేనా లేక ఏదయినా ప్రచారం కోసం చిత్రీకరించిందా? అనేది స్పష్టత లేదు. 

సన్నీ ప్రస్తుతం డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 'అన్ స్టాపబుల్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, తాజా వీడియో కూడా తన సినిమా కోసం చేసిన ప్రమోషన్ అయ్యుంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తూ, చర్చనీయాంశంగా మారింది.

More Telugu News