స్టాక్ మార్కెట్లకు ఈరోజు కూడా నష్టాలే

Markets ends in losses
  • 304 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 50 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 7 శాతానికి పైగా పతనమైన బజాజ్ ఫైనాన్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ట్రేడింగ్ చివర్లో సూచీలు కొంత కోలుకోవడంతో చివరకు నష్టాలు కొంత మేర తగ్గాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్లు కోల్పోయి 60,353కి పడిపోయింది. నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 17,992 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (1.91%), ఎన్టీపీసీ (1.77%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.75%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.27%), నెస్లే ఇండియా (1.22%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-7.21%), బజాజ్ ఫిన్ సవర్వ్ (-5.10%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.22%), ఇన్ఫోసిస్ (-1.32%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.09%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News