యువకులకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరక్కపోవడానికి కారణం ఇదే: శరద్ పవార్
- దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్న శరద్ పవార్
- ఉద్యోగం లేకపోతే పిల్లను ఎవరిస్తారని ప్రశ్న
- చదువుకున్న వాళ్లు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచన
దేశంలోను, మహారాష్ట్రలోను నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని శరద్ పవార్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీని ఇచ్చిన బీజేపీ... అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించిందని చెప్పారు. మహారాష్ట్రలో తమ కూటమి అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించామని... ఆ తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం కొలువుతీరాక రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని విమర్శించారు.