ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్రస్థాయి భేటీ... వేతనాల పెంపునకు డిమాండ్లు
- 14వ ఆర్థిక సంఘం నిధుల చెల్లింపునకు డిమాండ్
- రూ.8,660 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని స్పష్టీకరణ
- వాలంటీర్లకు, ఆయాల కంటే తక్కువ వేతనం ఇస్తున్నారని ఆవేదన
సర్పంచుల కంటే వాలంటీర్లకు, ఆయాలకే ఎక్కువ వేతనం అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీలకు రూ.15 వేల గౌరవవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ, జడ్పీటీసీలకు రూ.30 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కౌన్సిలర్లకు రూ.20 వేలు, కార్పొరేటర్లకు రూ.30 వేలు, మున్సిపల్ చైర్మన్ కు రూ.1 లక్ష, జడ్పీ కార్పొరేషన్ చైర్మన్లకు రూ.2 లక్షలు గౌరవ వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.