కృష్ణ జన్మభూమిపై నిర్మించిన మసీదుపై సర్వేకు ఆదేశించిన మధుర కోర్టు
- శ్రీకృష్ణుడి జన్మస్థానంపై వివాదం
- కృష్ణుడి జన్మస్థలంపై మసీదును నిర్మించారని ఆరోపిస్తూ హిందూవాదుల పిటిషన్
- సర్వేను నిర్వహించాలని కోర్టు ఆదేశం
మసీదు నిర్మించిన ప్రదేశం కృష్ణుడి జన్మస్థలమని పిటిషన్ లో వారు పేర్కొన్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆదేశాల మేరకు 1669-70 మధ్యకాలంలో 13.37 ఎకరాల్లోని కాత్ర కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారని హిందూ సేన జాతీయ వైస్ ప్రెసిడెంట్ సుర్జిత్ సింగ్ యాదవ్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు సర్వేను నిర్వహించాలని ఆదేశించింది.