Kalyan Ram: 'అమిగోస్' నుంచి కన్నడ బ్యూటీ పోస్టర్ రిలీజ్!

  • కన్నడ బ్యూటీగా ఆషిక రంగనాథ్ 
  • తెలుగులో ఫస్టు మూవీగా 'అమిగోస్'
  • కల్యాణ్ రామ్ జోడీకట్టిన భామ 
  • గ్లామర్ విషయంలో గట్టిపోటీ ఇవ్వనున్న ఆషిక 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న  సినిమా
Amigos movie update

ఈ మధ్య కాలంలో కల్యాణ్ రామ్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అలా ఆయన చేస్తున్న సినిమానే 'అమిగోస్'. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. 'ఇషిక' అనే పాత్రతో ఆమె ప్రేక్షకులను పలకరించనుంది. ఇషిక పాత్రను పరిచయం చేస్తూ ఆషిక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ లో ఆమె మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. ఈ సినిమాకి ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అనిపిస్తోంది. 

ఆషిక రంగనాథ్ కన్నడ బ్యూటీ. 2016లోనే కన్నడ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. 'అమిగోస్' తెలుగులో ఆమె చేస్తున్న మొదటి సినిమా. ఈ సుందరి రూపురేఖలు చూస్తుంటే మాత్రం, టాలీవుడ్లోని యంగ్ హీరోయిన్స్ కి గట్టిపోటీనే ఇచ్చేట్టుగా కనిపిస్తోంది..

More Telugu News