నేను ఈవెంట్స్ కు వెళ్లకపోవడానికి కారణం ఇదే: నయనతార
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను ఈవెంట్స్ కు వెళ్లకపోవడానికి కారణం ఇదే: నయనతార

Heroines will not get much importance as heroes get says Nayanatara
  • హీరోలకు ఇచ్చేంత ప్రాధాన్యత హీరోయిన్లకు ఇవ్వరన్న నయన్ 
  • ఆడియో ఫంక్షన్లకు హాజరైనా హీరోయిన్లను ఏ మూలనో నిలబెడతారని విమర్శ 
  • అందుకే ఈవెంట్లకు వెళ్లడం మానేశానని వివరణ 
సినీపరిశ్రమలో ఉండే అసమానతల గురించి స్టార్ హీరోయిన్ నయనతార స్పందించింది. హీరోలకు ఇచ్చేంత ప్రాధాన్యతను హీరోయిన్లకు ఇవ్వరని... అందుకే తాను సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం మానేశానని ఆమె తెలిపింది. తాను హీరోయిన్ గా రెండో దశాబ్దంలోకి ప్రవేశించిన తర్వాత తనకంటూ కొన్ని కలలు ఉండేవని... మహిళా ప్రాధాన్యత ఉండే సినిమాలు చేయాలనే కోరిక ఉండేదని చెప్పింది. 

అయితే ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని, హీరోయిన్లకు కూడా ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేకపోయేవారో అర్థమయ్యేది కాదని తెలిపింది. హీరోయిన్లు ఏదైనా ఆడియో ఫంక్షన్ కు హాజరైనా తమను ఏ మూలనో నిలబెట్టే పరిస్థితి ఉండేదని చెప్పింది. ఈ కారణాల వల్లే తాను సినిమా ఈవెంట్లకు వెళ్లడం మానేశానని తెలిపింది. 

నయనతార లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం కనెక్ట్‌. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో హర్రర్‌ థ్రిల్లర్స్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను చూరగొని, విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
Advertisement
Nayanthara
Tollywood
Kollywood

More Telugu News