ప్రభుత్వ అధికార లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు.. కాసేపట్లో కేసీఆర్ నివాళి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభుత్వ అధికార లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు.. కాసేపట్లో కేసీఆర్ నివాళి

Kaikala Satyanarayana last rites with state honors
  • రేపు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు
  • కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నట్టు తలసాని వెల్లడి
  • అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి
తెలుగు సినీ నట దిగ్గజం, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మృతితో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ అంత్యక్రియలు రేపు ఉదయం 10.30 గంటలక జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. మరోవైపు నటుడిగా సినీ పరిశ్రమకు, ఎంపీగా ప్రజలకు సత్యనారాయణ చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. 

ఈ మేరకు రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు కాసేపట్లో కైకాల నివాసానికి కేసీఆర్ వెళ్తున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు.
Advertisement
Kaikala Satyanarayana
Tollywood
Funerals

More Telugu News